బ్లాక్ శారీలో ప్రియమణి అదుర్స్..వైరల్ అవుతున్న ఫొటోస్

ప్రియమణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళింది. బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రియమణి గ్లామర్ రోల్స్ లో కూడా నటించి అందాలని చూపిస్తూ యువతని అట్రాక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ప్రియమణి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంది. తన పాత్ర బాగుంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇక టీవీషోల్లో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. అయితే ప్రియమణి ఇప్పుడు బ్లాక్ శారీలో మెరిసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో నారప్పలో నటించింది. ఢీ షోలో జడ్జిగా కూడా చేసిన మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక సెప్టెంబర్ 7 న విడుదల అవుతున్న జవాన్ సినిమాలో కూడా కనిపించనుంది. ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రొమోషన్స్ లో ప్రియమణి కూడా బిజీ అయిపోయింది. తాజాగా జరిగిన ఈవెంట్ లో ప్రియమణి బ్లాక్ శారీలో వచ్చింది. దీంతో అందరి కళ్ళు ప్రియమణి మీదే పడ్డాయి. బ్లాక్ శారీలో ప్రియమణి అందంగా కనిపించింది. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు బ్లాక్ శారీలో చాలా బాగున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలని చూసి హీరోయిన్ స్నేహ, విమలారామన్ లాంటి వాళ్ళు కూడా బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రియమణి ఫోటోలు షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.

జవాన్ సినిమాతో గట్టి కం బ్యాక్ ఇవ్వాలని ప్రియమణి ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా, దీపికా ముఖ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. షారుక్ ఫ్యాన్ అయిన అట్లీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలకి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.