ఖుషి తర్వాత రెండు సినిమాలను లైన్లో పెట్టిన విజయ్.. డైరెక్టర్స్ ఎవరంటే..?

సమంత – విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈరోజు రిలీజై మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ గ్రాండ్‌గా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో క్యూ అండ్ లైన్స్ వైర‌ల్‌ అయింది. ఫ్యాన్స్‌తో గంటలు తరబడి విజయ్ దేవరకొండ ముచ్చటించాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ లైఫ్ లో కొన్ని విషయాలను కూడా ఈ లైవ్ మీట్‌లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.

ఇక విజయ్ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్స్.. నాకోసం స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని ఆ కథలు రెడీ అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక మీరు ఫ్యూచర్లో సినీ రంగంలో మరేదైనా రోల్ ప్లే చేయాలనుకుంటున్నారా.. అంటే డైరెక్షన్ చేయడం అనేది చాలా ఎక్సైట్మెంట్ ఇస్తుంది. లైఫ్ లో కొంచెం టైం యాక్టింగ్ తర్వాత బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నా ఫ్యూచర్లో ఏదో పాయింట్‌లో డైరెక్షన్ వైపు వెళ్తా అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే నాకు ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టమని మా ఇంట్లో డెకరేషన్ ఎలా ఉండాలో నేనే సెలెక్ట్ చేశా.. ఫ్యూచర్ లో ఒక ఫామ్‌కొని దాన్ని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకోవాలని అనుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ లైవ్ ఇంట్రాక్షన్ లో విజయ్ దేవరకొండ చెప్పిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.