“అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు”.. విజయ్ ఆంటోనీ లైఫ్ లో ఎవరికీ తెలియని కన్నీటి విషాదాలు..!

కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ..తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించింది . నేడు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆమె తన బెడ్ రూమ్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది . గత కొంతకాలంగా డిప్రెషన్ కి గురైన ఈమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది . కానీ ఆ ట్రీట్మెంట్ ఫలించినట్లు లేదు .. అందుకే ఆమె సూసైడ్ చేసుకొని మరణించినట్లు తెలుస్తుంది . కాగా ఇదే క్రమంలో విజయ్ ఆంటోనీ లైఫ్ లో తన నాన్నగారు కూడా ఇదే విధంగా సూసైడ్ చేసుకొని మరణించిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇదే విషయాన్ని విజయ్ ఆంటోని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు . తనకి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు తన నాన్నగారు సూసైడ్ చేసుకుని మరణించారు అని.. అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను అని..అప్పటినుంచి నేను ఇప్పటివరకు ఆ విషయంలో బాధపడుతూనే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఆయన గతంలో సూసైడ్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్లకు మోటివేషన్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది .

సూసైడ్ అనేది పెద్దవాళ్లు ఫైనాన్స్ కారణంగా ..నమ్మించి మోసం చేసిన కారణంగా.. మరి ఏ కారణాల చేత అయినా వాళ్ళు చేసుకుంటారు అని ..కానీ పిల్లలు మాత్రం కేవలం స్ట్రెస్ , ఒత్తిడి కారణంగానే సూసైడ్ చేసుకుంటారు అని.. మరీ ముఖ్యంగా టెన్త్ అయిపోయిన తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్ టైం లో పిల్లలు ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతారని .. పేరెంట్స్ కూడా అలా పిల్లల్ని ఫోర్స్ చేస్తూ ఉండకూడదు అని.. అప్పుడే వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ వస్తాయని చెప్పుకొచ్చారు. సేమ్ అదే విధంగా తన కూతురు ఆత్మహత్య చేసుకుని మరణించడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!