బాలయ్య బాబి సినిమాలో విలన్ గా నటించబోతున్న ఆ కోలీవుడ్ హీరో..

బాలయ్య – బాబి కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. 2024 ఎన్నికలలోపే సినిమా థియేటర్లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం చూస్తున్నట్లు సమాచారం. బాలయ్య – బాబి కాంబోలో రూపొందుతున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నాడు. ఉప్పెన సినిమాతో విలన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విజయసేతుపతి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడు.

అదేవిధంగా సోషల్ మీడియాలో సైతం కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇక బాలయ్య – బాబీ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు రూ.100 కోట్లు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ కాంబోలో వచ్చే సినిమాకు హీరోయిన్ ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. పిరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉందట. అయితే భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాకు బాలయ్య రూ.25 కోట్ల రిజర్వేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం.


వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య వరుస విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాతో కూడా కచ్చితంగా మంచి హిట్ తన సొంతం చేసుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.