ఎన్టీఆర్ “కొండవీటి సింహం”లో చిరును తప్పించి మోహన్ బాబుకు అవకాశం ఇవ్వడానికి అసలు కారణం ఇదే..!?

తెలుగు సినిమా చరిత్రలోనే చిరంజీవి తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్నారు. చిరంజీవి సినీ జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.. వాటిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో కూడా కలిసి సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు తో చిరంజీవి మెకానిక్ అల్లుడు అనే సినిమాలు నటించాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ తో తిరిగిలేని మనిషి అనే సినిమాలో నటించాడు.

ఇదే సమయంలో ఎన్టీఆర్ తో మరో సినిమా చేసే అవకాశం చిరంజీవి కూడా వచ్చింది.. అంతే కాకుండా ఐదు రోజుల షూటింగ్ తర్వాత చిరంజీవి స్థానంలో మోహన్ బాబుని తీసుకున్నారు. ఆ సినిమా ఏంటి..? మెగాస్టార్ ను ఎందుకు తీసుకోలేదు అన్న విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ఎన్టీఆర్ హీరోగా కే .రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి సింహం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొడుకు పాత్ర కోసం ముందుగా చిరంజీవిని అనుకున్నారు.

అయితే సినిమాలో ఎన్టీఆర్ కొడుకుగా నటించిన చిరంజీవి ఆయనను విభేదిస్తూ పవర్ఫుల్ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. ఆ పాత్రకు ముందు చిరంజీవి కూడా ఒప్పుకున్నారు. షూటింగ్ ప్రారంభమైంది ఐదు రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఎన్టీఆర్‌ను ఎదిరిస్తూ డైలాగులు చెప్పేందుకు చిరంజీవి ఇబ్బంది పడ్డారు. అందుకు ప్రధాన కారణం ఎన్టీఆర్ అప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్నారు. కానీ చిరంజీవి అప్పుడప్పుడే కెరీర్ ను మొదలు పెడుతూ హీరోగా ఎదుగుతున్నారు.

ఎన్టీఆర్ ఆయన సినిమా కోసం కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు. ఇక దాంతో షూటింగ్ ఇలాగే జరిగితే కష్టమని భావించిన మేకర్స్ ఈ క్రమంలోనే చిరంజీవి స్థానంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబుని తీసుకున్నారు. మోహన్ బాబు- ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబు- ఎన్టీఆర్ తో పోటీగా నటించారు. సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.