బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్‌ ఆస్తులు విలువ అన్ని వేలకోట్ల.. స్టార్ హీరోలు కూడా పనికిరారుగా..!

బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్టులో ఆలియా భట్ కూడా ఒకటి.. బాలీవుడ్ నిర్మాత మహేష్ భ‌ట్ మరియు నటి సోనీ రజ్దాన్ ల కుమార్తె అయిన ఆలియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ వచ్చింది. తన తొలి సినిమాతోనే మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా మారింది.

అదేవిధంగా బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కేవలం తన సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ గొప్ప న‌టిగా పేరు తెచ్చుకుంది. త్రిబుల్ ఆర్ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. అదేవిధంగా హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాతో హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అన్ని ఇండస్ట్రీలోనూ సక్సెస్ నటిగా దూసుకుపోతున్న అలియా భట్ ఆస్తులు కూడా గ‌ట్టిగా కూడబెడుతోంది.

అలియా భట్ నికర అస్తులు విలువ సుమారు రూ.557 కోట్లు.. అదే విధంగా ఈ ముద్దుగుమ్మ తాను నటించే ఒక్కో సినిమాకు రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటుంది. అలాగే `ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్` అనే ప్రొడక్షన్ హౌస్ ను ఈమె రన్ చేస్తోంది. అలియా నటించి, నిర్మించిన `డార్లింగ్స్` అదే బ్యానర్‌పై తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తన సొంత దుస్తుల బ్రాండ్ `Ed-A-Mamma` నుంచి అలియా భట్ కు భారీ లాభాలు వస్తున్నాయి.

ఈ సంస్థ ఏడాది కిందటే రూ. 150 కోట్ల వ్యాపార స్థాయికి చేరుకుంది. ఈ-కామర్స్ కంపెనీ నైకాతో పాటు స్టైల్‌క్రాకర్ అనే ఫ్యాషన్ స్టార్టప్ లో అలియాకు వాటాలు ఉన్నాయి. అనేక బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తోంది. ఇక విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్ లు, విదేశాల్లో సొంత ఇల్లు వంటివి అలియా భట్ కు కొదవే లేవు. కాగా, అలియా భట్ గత ఏడాదే ఓ ఇంటిది అయింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ఏడడుగులు వేసి.. ఏడు నెలలు తిరక్క ముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.