దూకుడు సినిమా గురించి తెలియని విషయాలు ఇవే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 2011 వ సంవత్సరం సెప్టెంబర్ 23న ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ అచంట ,అనిల్ సుంకర కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ముందు వరకు మహేష్ బాబు వరుసగా ఫ్లాపులతో డిజాస్టర్ గా ఉన్నారు.

Watch Dookudu - Disney+ Hotstar

పోకిరి సినిమా తర్వాత మహేష్ నటించిన సైనికుడు, అతిథి, ఖలేజా వంటి సినిమాలు ఘోరమైన ప్లాపులను అందుకున్నాయి. మహేష్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన సినిమా దూకుడు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా కీలకం ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతూ ఉంటుందట. అందుకే తండ్రి పాత్ర కోసం మొదట చాలామంది స్టార్ హీరోలను సైతం అప్రోచ్ అయ్యారట శ్రీనువైట్ల. అలా శ్రీహరిని కూడా అడిగారట.

Mahesh Babu's Dookudu clocks 10 years; special screenings in theatres  across Andhra Pradesh, Telangana

అలాంటి సమయంలో ఫాదర్ రోల్స్ చేయడం ఇష్టం లేక ఆయన నో చెప్పారట. హీరోయిన్గా కూడా మొదట సమంత అని అనుకోలేదట శ్రీనువైట్ల ఎవరైనా కొత్త హీరోయిన్లతో చేద్దామనుకోగా సమంత అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని నిర్మాతలు భావించడంతో ఈ సినిమాని చేశారు. ఈ సినిమా కథ కూడా పవన్ కళ్యాణ్ కు వినిపించగా కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేశారు. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్లో పార్వతి మిల్టన్ నటించింది. మహేష్ ఇందులో అద్భుతంగా నటించారు.బ్రహ్మానందం కామెడీ కూడా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ప్రకాష్ రాజ్ ఇందులో మహేష్ తండ్రిగా నటించారు.