రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్స్ వీళ్ళే.. బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళికి నో చెప్పారా…!!

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో హిట్ మూవీలు అందించిన రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఎంతోమంది అగ్ర హీరోలు సైతం క్యూ కడతారు. కానీ రాజమౌళి ఆఫర్ ఇచ్చిన కొంతమంది రిజక్ట్ చేశారట. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది.

అలాంటి సినిమా మొదట బాలీవుడ్ సెలబ్రిటీస్ తో రూపొందిద్దామనుకున్నాడట. అక్కడ రాజమౌళి ఆఫర్ ను ఎవరు పట్టించుకోలేదట. అలా బాహుబలిలో ఆఫర్ పోగొట్టుకున్న తారలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించాడట. ఆమె ఎక్కువ పారిదోషకం అడిగిందట. తర్వాత మంచు లక్ష్మిని అడగ్గా.. రానాకు తల్లి పాత్రలో చెయ్యనని చెప్పిందట. దీంతో ఆ ప్రాజెక్ట్ రమ్యకృష్ణను వరించింది. అంతేకాదు ఆ పాత్రలో రమ్యకృష్ణ తప్ప మరెవరు సెట్ కార‌ని వాదన కూడా ఉంది. ఇక తమిళ్ స్టార్ హీరో సూర్యను కూడా బాహుబలిలో ఓ పాత్ర కోసం అడిగాడట రాజమౌళి. కానీ ఆ క్యారెక్టర్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదట.

ఈ విషయాన్ని సూర్యా కూడా అనేక ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే.. బళ్లాలదేవుడి రోల్ కు వివేక్ బబెరాయ్ను అనుకున్నారట. ఆయన అప్పటికే వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడం వల్ల అది కూడా క్యాన్సిల్ అయింది అట. ఇక ఫైనల్లీ బాహుబలి సినిమాలో మెయిన్ రోల్ అయినా కట్టప్ప క్యారెక్టర్ కు మోహన్ లాల్ ను, అమితాబ్ బచ్చన్ ను అనుకున్నారట. వాళ్లు కూడా వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండడం వల్ల అవి కూడా రిజెక్ట్ అయ్యాయి. బాహుబలి ముందుగా బాలీవుడ్ ప్రాజెక్ట్ అనుకుని.. ఈ సినిమా కోసం హృతిక్ ను సంప్రదించాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో తెలుగులో ఆ ప్రాజెక్టును మొదలుపెట్టారు.