జైలర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆ తెలుగు స్టార్ హీరో ఎవరంటే….!!

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ” జైలర్ “. ఈ మూవీ ఆగస్టు 9న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. కొన్ని రోజులుగా వరుస పరాజయాలు అందుకుంటున్న రజనీకాంత్ కు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.

అంతేకాకుండా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది. అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమాను ఓ హీరో రిజెక్ట్ చేశాడని కోలీవుడ్ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఆ హీరో మరెవరో కాదు.. మన మెగాస్టార్ చిరంజీవినే అట. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మొదట ఆ కథను చిరంజీవికి వినిపించాడట.

The Senior Vice-Minister of Tourism, Japan, Mr. Hiroshi Kajiyama calls on the Minister of State (Independent Charge) for Tourism, Dr. K. Chiranjeevi, in New Delhi on February 12, 2013.

అయితే.. అందులో పెద్దగా పాటలు లేవు, ఫైట్లు లేవంటూ చిరంజీవి ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపించలేదట. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ రజినీకాంత్ దక్కించుకున్నట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఈ మూవీ చిరంజీవి చేసుంటే.. మెగాస్టార్ లిస్టులో మరో బ్లాక్ బస్టర్ చేరేది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.