సినీ కెరీర్ లో యాడ్స్ నటించడానికి ఇష్టపడని స్టార్స్ వీళ్ళే..

సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకుని యాడ్స్ ల ద్వారా కూడా సంపాదిస్తూ ఉంటారు. ఆయా కంపెనీలో యాడ్స్ లో నటించడంతోపాటు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ కంపెనీలకు తమ ఉత్పత్తులను పెంచుకోవడం కోసం సినిమా ద్వారా క్రేజ్ ఉన్న హీరోలతో ర‌క‌రకాల యాడ్స్ రూపొందించి మార్కెట్ చేస్తుంటారు. ఇక మరోవైపు కొంతమంది స్టార్ హీరోలు మాత్రం అందుకు అంగీకరించకుండా ఎటువంటి యాడ్స్ లో నటించకుండా కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. నందమూరి నట‌సింహ బాలకృష్ణ ఇంతవరకు ఏ యాడ్‌లో కూడా నటించలేదు.

జనాలకు ఉపయోగపడే యాడ్ ఉచితంగా చేస్తాను తప్ప.. డబ్బులు తీసుకొని మోసం చేయనని చెప్పారు. అదేవిధంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో యాడ్ చేసేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. కానీ మోహన్ బాబు అందుకు ఒప్పుకోలేదు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా యాడ్స్ లో నటించే ఆఫర్ వచ్చినా కూడా తిరస్కరిస్తారట. తాను ఇలాంటి పనులు చేయాలని తేల్చి చెప్పేసాడట కళ్యాణ్ రామ్. ఇక సౌత్‌లో టాప్ హీరోయిన్గా ఎదిగిన గౌతమికి కూడా యాడ్స్ అవకాశాలు వచ్చినప్పటికీ డబ్బులు కూడా బాగానే ఇస్తామన్నా గౌతమి నో చెప్పేసిందట.

ఇటీవల కాలంలో గౌతమిలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే యాడ్స్ లో కనిపించబోతుందని సమాచారం. అదేవిధంగా సాయి పల్లవికి ఫేర్నెస్ క్రీమ్ యాడ్ చేసే అవకాశం వచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా తాను చేయనని చెప్పేసిందట. మంచు విష్ణు కూడా అదే బాటలో పయనిస్తున్నాడు కెరీర్ స్టార్టింగ్‌లో యాడ్స్ కంపెనీలో ఆఫర్ ఇచ్చిన విష్ణు తిరస్కరించాడు. అదేవిధంగా మనోజ్ కూడా యాడ్స్ నటించలేదు. టాలీవుడ్ టాప్ బ్యూటీ అనుష్క, కామెడీ స్టార్ అల్లరి నరేష్, సాయి ధరంతేజ్ కూడా యాడ్లో ఆఫర్లు వచ్చిన వాటిని రిజెక్ట్ చేశారట. ఇలా చాలామంది హీరోలు యాడ్సులలో నటించడం ఇష్టం లేక ఆఫర్స్ వచ్చినా వాటిని రిజెక్ట్ చేశారు.