ఆ స్టార్ హీరో టెస్టులో పాస్ కాని జ‌క్క‌న్న‌… వామ్మో ఎవ‌రా హీరో… ఏంటా టెస్ట్‌…!

తెలుగు ఇండస్ట్రీని గర్వపడే విధంగా సినిమాలను రూపొందిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవ‌ల‌జ‌క్క‌న తీసిన‌ సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి రాజమౌళితో సినిమా తీయాలని ప్రతి హీరో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఒక హీరోతో సినిమా తీయాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడట.

కానీ ఆ హీరోతో సినిమా తీయలేకపోతున్నాడు. ఇంతకీ ఎవరు ఆ హీరో.. ఎందుకు వారి కాంబోలో సినిమా రావడం లేదు.. ఒకసారి చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సూర్యతో ఎప్పటినుంచో రాజమౌళి సినిమా తీయాలని భావించారట. సూర్యతో సినిమా చేయడం కోసం రాజమౌళి ఎన్నో కథలను కూడా అనుకున్నాడట‌. కానీ సూర్యకు తగ్గట్టుగా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఇప్పటికీ 10 సార్లు ఫెయిల్ అయ్యాడట జ‌క్క‌న‌. రాజమౌళి పది సార్లు స్టోరీ రెడీ చేయాలని భావించిన సూర్య కోసం సరైన కథ దొరకకపోవడంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వాయిదా పడుతూనే ఉందట.

ఇలా సూర్య ఏకంగా రాజమౌళి టాలెంట్‌కే పరీక్ష పెట్టారని.. ఆ పరీక్షలో జక్కన్న గెలవలేక పోతున్నాడని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు. స్క్రిప్ట్ ప‌నిలో బిజీగా ఉన్నాడు. అడ్వెంచర్స్ మూవీ గా ప్రేక్షకులకు ముందుకి రాబోతున్న ఈ సినిమా ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లోనే షూటింగ్ జరుపుకుంటుందని మూవీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వివరించారు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా పూర్తి చేసుకుంటున్నారు ఈ సినిమా షూటింగ్ అయిపోగానే రాజమౌళి సినిమాతో బిజీగా అవుతాడు.