షకీలా చెడు వ్యాసానికి బానిస కావడానికి కారణం ఆ స్టార్ హీరోయిన్ అట..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టర్ షకీలా జ‌ర్నీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో వ్యాంప్ పాత్రలో నటించిన షకీలా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది. ఒక‌ప్పుడు ఈమె సినిమా వస్తుందంటే చాలు ధియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కట్టే రేంజ్ లో ఈమె ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. ఇక గత కొంతకాలంగా ఎటువంటి సినిమాలలో నటించకుండా సినిమాలకు దూరంగా ఉన్న షకీలా తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్‌బాస్ షో లో పాల్గొంది.

ఈ షోలో రెండు వారాలు కంటిన్యూ అయిన ఈమె అధిక మోతాదులో సిగరెట్లు కాల్చడం చూసాం. అయితే షకీలా ఇలా చెడు వ్యసనాలకు బానిస అవ్వడానికి సిగరెట్లు అలవాటు చేసుకోవడానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ అనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గతంలో షకీలా బిగ్ బాస్ కు రాకముందు ఓ ఇంటర్వ్యూకు హాజరయింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా షకీలా మాట్లాడుతూ నేను సిగరెట్లు ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వలన అలవాటు చేసుకున్నానని వివరించింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన పూజ భ‌ట్ చాలా స్టైలిష్ గా సిగరెట్ కాల్చేదని ఆమెను చూసి నాకు కూడా సిగరెట్ అంతే స్టైలిష్ గా కాల్చాలని తపన మొదలైందని.. అప్పటినుంచి సిగరెట్ కాల్చడం మొదలు పెట్టానని వివ‌రించింది. మెల్లమెల్లగా అది అలవాటుగా మారిందని.. తరువాత అదే వ్యసనం అయిందని చెప్పింది షకీలా. ఇక తాజాగా బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన షకీలా బిగ్ బాస్ బజ్‌లో గీతురాయ్‌తో ముచ్చ‌టించింది. ఈ టైంలో హౌస్ మేట్స్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది ష‌కీలా.