బిగ్ బాస్ సీజ‌న్ 7: ఓటింగ్ లో వెన‌క‌ప‌డ్డ టాప్ కంటెస్టెంట్‌.. మూడో వారం ఇంటి బాట ప‌ట్టేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రసవత్తరంగా సాగుతోంది. గత రెండు సీజన్లు అట్టర్ ప్లాప్ అవడంతో.. ఈసారి సరికొత్త గేమ్ ప్లాన్ తో నిర్వాహకులు షోను రన్ చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 రెండు వారాలను పూర్తి చేసుకుంది. మొదటి వారం హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారం న‌టి షకీలా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

ఇక మూడో వారం నామినేషన్స్ మొత్తం ఏడు మంది ఉన్నారు. రతికా రోజ్, అమర్ దీప్, ప్రియాంక, శుభశ్రీ, గౌతమ్, దామిని, ప్రిన్స్ యావర్ ఎలిమినేష‌న్ కు నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురు టాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ లోనే ఉండడంతో.. మూడో వారం ఎవరు ఇంటి బాట పడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఓటింగ్ లో సీరియల్ యాక్టర్ అమర్ దీప్ దూసుకుపోతున్నాడు.

ఆ తర్వాత గౌతమ్ కృష్ణ భారీ ఓట్లతో ముందంజలో ఉన్నాడు. ఇక లిస్ట్ లో ప్రియాంక, సింగ‌ర్ దామిని నిలిచారు. ముఖ్యంగా దామని ఓటింగ్ లో చాలా వెనకబడిపోయింది. ఆమె ఆట తీరు, మాట తీరు ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా ఆకట్టుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె భారీగా ఓట్లు సంపాదించుకోలేకపోయిందని అంటున్నారు. ఇక ఈ వారం దామినీనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ‌ని తెలుస్తోంది.