థమన్.. అప్పుడు ” అఖండ ” ఇప్పుడు ” స్కంద ” అసలు నిజం ఇదేనా…!!

మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాపీనింగ్ సంగీత దర్శకులలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒకడు. మరి అతనితో సరిగ్గా వర్క్ చేయించుకుంటే దాని అవుట్ పుట్ ఒక్కోసారి ఎవరు ఊహించని రేంజ్‌లో అందిస్తూ ఉంటాడు. ఆ రేంజ్ సత్త థమన్ కి మాత్రమే ఉంది.

అయితే థమన్ ఇచ్చిన క్రేజీ మ్యూజిక్ ఆల్బమ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన అన్ని సినిమాలకి కూడా సాలిడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన గత సినిమా ” అఖండ ” దెబ్బకి అయితే తెలుగు స్టేట్స్ లో థియేటర్స్ బాక్సులు బద్దలైపోయాయి. అయితే మళ్లీ ఇదే సీన్ యంగ్ హీరో రామ్ పోతినేని.. దర్శకుడు బోయపాటి శ్రీను చేసిన ” స్కంద ” సినిమాకి కూడా రిపీట్ అయిందని అంటున్నారు.

పలు థియేటర్స్ లో నార్మల్గా పెట్టే సౌండ్ పెట్టిన కూడా థమన్ ఇచ్చిన మ్యూజిక్ కి సౌండ్ స్పీకర్లు సరిగ్గా పనిచేయడం లేదని అంటున్నారు. దీనితో మ్యూజిక్ పరంగా మళ్లీ థమన్ కూడా అఖండ తరహాలోని బద్దలు కొట్టేస్తున్నాడని చెప్పాలి.