మళ్లీ ” ఏజెంట్ ” ఓటీటీ రాకకి బ్రేక్.. కార‌ణం ఇదే..!!

అక్కినేని అఖిల్ హీరోగా, యంగ్ బ్యూటి సాక్షి వైద్య హీరోయిన్గా.. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన రీసెంట్ యాక్షన్ మూవీ ” ఏజెంట్ “. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత షాకింగ్ రెస్పాన్స్ ని అందుకోగా అఖిల్ కెరీర్ లో ఘోర పరజయంగా మిగిలిపోయింది.

దీంతో ఈ సినిమా ఫలితాన్ని హీరో, నిర్మాతలు కూడా చాలా హెల్తీ గా తీసుకుని క్షమాపణలు చెప్పారు. మరి దీని తరువాత అంతా సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూశారు. అయితే ఈ సినిమా ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సింది కానీ లేట్ అయింది.

ఫైనల్ గా ఈ సినిమాని సోనీ లీవ్ వారు ఈరోజు (సెప్టెంబర్ 29) నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు చేదు వార్త ఏమిటంటే… ఈ సినిమా ఈరోజు కూడా స్ట్రీమింగ్ కి రాలేదు. దీంతో ఏజెంట్ కి మళ్లీ బ్రేక్ పడిందని చెప్పాలి. మరి సినిమా ఎప్పుడు వస్తుంది అనేది మళ్లీ సస్పెన్స్ గా మారింది.