స్కంద ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఊచకోత..!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన భారీ మాస్ మసాలా యాక్షన్ చిత్రం స్కంద. ఈనెల 28వ తేదీన అంటే నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ సక్సెస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా రామ్ కెరియర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రంగా గుర్తింపు సాధించింది. ఇక ఈ సినిమాలో రామ్ కి జోడిగా కన్నడ బ్యూటీ శ్రీ లీల నటించగా.. ఒక కీలక పాత్రలో శ్రీకాంత్ కూడా కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతకుమించి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై కూడా చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇవ్వడం గమనార్హం. సినిమా మొదటి రోజు బాగానే వసూలు రాబట్టినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ కొన్నిసార్లు మాస్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకోవడం ఈ సినిమాకు ఒక ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఇక తెలంగాణ యాసలో పలు డైలాగ్స్ సినిమాలో బాగా క్లిక్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద బోయపాటి , రామ్ కాంబినేషన్ అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది.

ముఖ్యంగా రామ్ కెరియర్ లోనే రెండు తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా స్కంద నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఏరియాల ప్రకారం ఈ సినిమా అందుకున్న కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో రూ.3.23 కోట్లు, సీడెడ్ లో రూ.1.22 కోట్లు, వైజాగ్ లో రూ.1.19 కోట్లు, ఈస్ట్ లో రూ.59 లక్షలు, వెస్ట్ లో రూ.41 లక్షలు, కృష్ణా లో రూ.45 లక్షలు గుంటూరులో రూ.1.04 కోట్లు, నెల్లూరులో రూ.49 లక్షల షేర్ రాబట్టింది. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో మొదటి రోజు ఈ సినిమా రూ .8.62 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.