బిగ్‌బాస్ హెచ్చరించినా శివాజీ తీరుమార‌ట్లేదుగా .. బిగ్‌బాస్ సీరియస్ అయితే..!!

బిగ్‌బాస్ లో అందరూ ఆడటానికి వచ్చారు. శివాజీ మాత్రం అదే పాట మళ్లీ మళ్లీ పాడుతున్నాడు. వద్దని చెప్పినా సరే తీరు మార్చుకోవడం లేదు. అలానే ఆట తక్కువ సోది ఎక్కువ అనేలా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ” బిగ్ బాస్ ష‌ 4వ పవర్ అస్త్ర కోసం పోటీ దారులు రెడీ అయిపోయారు. ఇంతకీ గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగింది ? అనేది ఇప్పుడు చూద్దాం. గురువారం జరిగిన బజర్ గేమ్ లో అమర్‌దీప్, గౌతమ్ జంటగా వెళ్లి విజయం సాధించారు.అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. తరువాతి రోజు మొదలవడంతో గురువారం ఎపిసోడ్ అయితే అందరూ కిచెన్ లో భోజనం చేస్తుంటే… యావర్, ప్రశాంత్ మాత్రం బజర్ దగ్గర కూర్చుని తింటున్నారు.

ఈ కారణం లోనే యావర్.. శివాజీని చపాతీలు తీసుకుని రమ్మని అన్నాడు. అక్కడ గొడవ షురూ అయింది. అయితే బజర్ దగ్గర కూర్చుని తినడం ఎందుకు ? అది స్వార్థం అవుతుంది కదా ? అంత ఉంటే మంచిది కాదని సందీప్ మాస్టర్ యావర్ తో అన్నాడు. దీంతో వీళ్ళిద్దరూ మాటలతో కొట్టుకున్నంత పనయింది. ఈ క్రమంలోనే తన ప్లేట్ ని కిచెన్ లో పడేసి వెళ్లిపోయాడు యావర్. దీంతో ప్రియాంక, యావర్ తో వాదించింది. అలా ప్రిన్స్ గొడవ కాస్త శివాజీ, శోభా శెట్టి గొడవగా మారింది. ” ఈ ఇంట్లో ఎవరికీ లేదు, మీకు మాత్రమే ప్రతి దాన్ని గొడవ చేయాలని ఉంది “అని శివాజీపై శోభా రెచ్చిపోయింది.

హౌస్ లో ఫస్ట్ వారం బాగానే ఉన్న శివాజీ.. రెండో వారం వచ్చేసరికి బయటకెళ్ళిపోతా, బయటకి వెళ్ళిపోతా అని పలుమార్లు అన్నాడు. దీంతో వీకెండ్ ఎపిసోడ్లో చిన్న వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇక అలా అననని చెప్పుకొచ్చాడు. తాజాగా గురువారం ఎపిసోడ్లో రతిక తో మాట్లాడుతూ..” ఒట్టమ్మా, ఇన్ని రోజులు దాచుకుని ఉండటం నావల్ల కావట్లేదు ” అని అన్నాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నాగ్ ఎంత చెప్పినా శివాజీ అలా అనడం బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినట్లే. బిగ్‌బాస్ దీనిపై సీరియస్ అయితే మాత్రం శివాజీని ఇంటికి పంపేచేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.