అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి నో చెప్పిన మహేష్.. అందుకే బాలీవుడ్ హీరో తో!

త్రివిక్రమ్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా ‘ గుంటూరు కారం ‘ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాభోతుంది.

ఇక ఈ సినిమా అయిపోయిన తరువాత మహేష్, రాజమౌళి దర్శకత్వం లో నటించబోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్న మహేష్ బాబు కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే మహేష్ సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలతో పాటుగా ప్లాప్ సినిమా లు కూడా ఉన్నాయి. మహేష్ సక్సెస్ ని ఎంత తేలికగా తీసుకుంటాడో ఫెయిల్యూర్ ని కూడా అంతే తేలికగా తీసుకుంటాడు. అందుకే సూపర్ స్టార్ గా ఏదిగాడు. ఇక మహేష్ తనకు సూట్ కావని కొన్ని, షెడ్యూల్ ఖాళీగా లేదని వదులుకున్న సినిమాలు చాలా  ఉన్నాయి. తాజాగా ఒక బాలీవుడ్ సినిమా ని కూడా మహేష్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన బాలీవుడ్ సినిమా ‘ యానిమల్ ‘ ని మహేష్ వదులుకున్నట్లు నిన్నటినుండి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో కూడా సందీప్ రెడ్డి, మహేష్ కి ఒక కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు సందీప్ చెప్పిన కథని మహేష్ రిజెక్ట్ చెయ్యగా ప్రస్తుతం అదే కథ లో బాలీవుడ్ హీరో రణబీర్ ని హీరో గా తీసుకొని ‘ యానిమల్ ‘ సినిమా తీసినట్లు సమాచారం. తాజాగా ‘ యానిమల్ ‘ సినిమా కి సంబందించిన టీజర్ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. ఇంత మంచి సినిమా ని మహేష్ ఎందుకు వదులుకున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్త అసలు నిజమేనా?కాదా? అనేది మాత్రం ఎవరికి తెలీదు.