నాని నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ గా తమిళ్ యంగ్ బ్యూటీ.. ఎవరంటే..?

హీరో నాని ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గత కొంతకాలంగా నాని నటించిన సినిమాలన్నీ హిట్‌ అవడంతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. గత ఏడాది దసరా సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు నాని. నాని మార్క్ 30వ‌ సినిమాగా హాయ్ నాన్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మృనాల్ ఠాగూర్ నటిస్తుంది. యంగ్ డైరెక్టర్ సౌరవ్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఇక నాని తన నెక్స్ట్ సినిమా.. దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేస్తున్నాడు. ఆల్రెడీ వీరిద్ద‌రి కాంబోలో అంటే సుందరానికి సినిమా వ‌చ్చి మంచి సక్సెస్ అందుకుంది. దీంతో నాని 31వ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందట.

మరి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు చేస్తారు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉంది. చివ‌రికి ఈ మూవీలో తమిళ్ యంగ్ బ్యూటీ టాలెంటెడ్ హీరోయిన్ అయినా ప్రియాంక అరుణ్ మోహన్‌ను హీరోయిన్గా లాక్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఈ ఇంట్రెస్టింగ్ పెయిర్ తెరపై ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింతగా పెరిగింది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడక తప్పదు.