హౌస్ లో బ్యూటి కాంటెస్ట్.. నాకేం తక్కువ అంటూ శివాజీపై ఫైర్ అయిన అమర్‌దీప్‌..!

బిగ్ బాస్ 7 తెలుగు ఈ ఏడాది ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే మూడు వారాల్లో వరుసగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నాలుగో వారానికి సంబంధించి ఇప్పటికే నలుగురు నామినేషన్స్ కు ఎంపికయ్యారు. ఈ వారం నామినేషన్ లో శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక, రతిక, ప్రిన్స్ ఉన్నారు. అయితే హౌస్ లో కొత్త కొత్త టాస్కులు ఇస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు పరీక్ష పెడుతుంది. తాజాగా ఇవాళ రిలీజైన బిగ్ బాస్ షోలో సరికొత్త టాస్క్ ను పరిచయం చేశాడు. ఈ షోలో హౌస్ మేట్స్ మధ్య అందాల పోటీ నిర్వహించారు.

ఈ పోటీల్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ విచిత్రమైన గెటప్పుల్లో కనిపించి సందడి చేశారు. అయితే ఈ పోటీల్లో ఎవరో ఒకరిని విజేతగా ప్రకటించవలసిన బాధ్యత జడ్జిలుగా వహిస్తున్న శివాజీ, సందీప్, శోభ శెట్టి పైనే ఉంది. అయితే అందాల పోటీల్లో కంటెస్టెంట్స్ అందరూ ప్రదర్శన ఇచ్చారు. ఆ తరువాత ఈ పోటీలో విజేతగా శుభశ్రీ అంటూ జడ్జిలు ప్రకటించగా.. అమర్ దీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ జడ్జ్మెంట్ పై నాకు అనుమానం ఉంది. నేను మాట్లాడాక చెప్పండి అన్నాడు.

అలాంటి ఎంటర్టైన్మెంట్ నేను మీకు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించాడు. దీంతో హౌస్ ఒక్కసారిగా హాట్ హాట్ గా మారింది. మీకు ఇష్టమైన వారికి ఇచ్చుకుంటున్నారు అన్నాడు. అయితే దీనికి శివాజీ సైతం రిప్లై ఇచ్చాడు. సుబ్బు ఇనోవేటివ్ గా కనిపించింది చెప్పిన డ్రెస్సెస్ ప్రకారం… ముందు నువ్వు రూల్ బుక్ చూసి మాట్లాడు అంటూ అమర్‌దీప్‌కు కౌంటర్ ఇచ్చాడు. అయితే ఇవన్నీ వాడుకోమని చెప్పారు. కానీ ఇవన్నీ చెప్పలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు అమర్‌. చివరికి ఈ టాస్క్ శుభశ్రీని ప్రకటించారు. ఆ తర్వాత ప్రిన్స్, ప్రశాంత్, శుభశ్రీ నాల్గవ పవర్ అస్త్ర కోసం పోటీ పడగా… చివరికి ప్రశాంత్ నాలుగో కంటెస్టెంట్గా నిలిచాడు.