పిచ్చి పట్టినట్టు అరుస్తున్న శోభ.. ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తుతా నీకెందుకు అంటూ ఫైర్ అయిన‌ గౌతమ్..!!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకుల అంచనాలు మించి ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కంటి స్టెంట్స్ మధ్య పోటీ, గొడవలతో బిగ్ బాస్ లవర్స్ కు కావాల్సినంత కిక్ అందుతుంది. ఇక ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కంటిస్టేన్స్.. హౌస్ మేట్స్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం పవర్ అస్త్ర సంపాదించుకునే అవకాశం.. అమర్ దీప్, శోభ శెట్టి, ప్రిన్స్ యావర్ రాగా… ప్రిన్స్ టాస్క్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది.

ఇక మిగిలిన ఇద్దరు గురించి కన్ఫెషన్ రూమ్లో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని మిగిలిన కంటేస్టేంట్స్ చెప్పిన వీడియో బహిర్గతం చేశాడు బిగ్ బాస్. దీంతో హౌస్ లో హీట్ మరోసారి మొదలైంది. ఈ మేరకు బిగ్ బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో…” మిగతా కంటెండర్స్ అయినా శోభ, అమర్ మీరు మూడో పవర్ ఆస్త్ర పొందేందుకు కంటెస్టెంట్స్ చెప్పే కారణాలను బిగ్ బాస్ మీరు చూపించాలి… అనుకుంటున్నారు అంటూ.. వీరు అనర్హులు అని చెప్పిన వీడియో బహిర్గతం చేశాడు బిగ్ బాస్.

దీంతో శోభ పవర్ అస్త్ర అనర్హురాలుగా గౌతం చెప్పిన సమాధానం ఆమెకు నచ్చలేదు. ఇంకేముంది పిచ్చి పట్టినట్లు రెచ్చిపోయింది శోభ. ‘ నువ్వు చెప్పిన రీజన్ బక్వాస్ రీజన్’అంటూ శోభ రెచ్చిపోవడంతో గౌతమ్ కూడా కంట్రోల్ తప్పి ‘ నా బాడీ నా ఇష్టం… పొద్దున్న ఎత్తుత.. రాత్రి ఎత్తుతా’ అంటూ శోభ ముందే డంబుల్స్ ఎత్తి పడేస్తున్నాడు. ఈ ప్రోమో మరింత ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.