ప్రభాస్ పెద్ద బావ… రోషన్ చిన్న బావ… హీరోయిన్ కామెంట్స్ వైరల్…!!

” రక్ష ” సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం హీరోయిన్ గా స్థిరపడిన బ్యూటీ యానీ. చిన్న వయసులోనే తన యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ” తికమక తండా ” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు మూవీ టీం. ఈ క్రమంలోని యానీ.. యాంకర్ అడిగిన ప్రశ్నలకు తగిన స్థాయిలో రిప్లై ఇచ్చింది. ఈ మేరకు.. నీ ఇమాజీనేషన్‌లో ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో ఎవరిని ఏ రిలేషన్ లో ఊహించుకుంటావు అని ప్రశ్నించాడు యాంకర్.

దీనికి స్పందించిన యానీ..” రామ్ చరణ్ అన్నయ్య, ప్రభాస్‌ను బావ అని చెప్పింది”. అయితే మరి రోషన్‌ని ఏ రిలేషన్ లో ఊహించుకుంటావ్ అని అడగగా.. ప్రభాస్ పెద్ద బావ, రోషన్ చిన్న బావ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం యానీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.