పూజా హెగ్డే కు పూర్వ వైభవం.. ఒకేసారి మూడు సినిమాల్లో..!!

ఘ‌థఃళ‌క్ష‌ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. చాలావరకు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ఱ‌స‌న నటించి మెప్పించింది. అయితే గత కొంతకాలంగా వరుస ప్లాపులను ఎదుర్కొంటున్న పూజా హెగ్డే ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. దీంతో కొంతకాలంగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. ఇక ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయిందంటూ.. న్యూస్ లు కూడా వైరల్ అయ్యాయి.

కానీ తాజాగా పూజా హెగ్డే కు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు తెలుస్తుంది. రెండేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన పూజకి ఇటీవల బ్యాడ్ టైం నడిచిన.. ఆమె మళ్లీ ఫామ్ లోకి వచ్చేసిందట. ఈ మేరకు తెలుగులో మూడు సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఓ తెలుగు ప్రొడక్షన్ హౌస్ తో పూజ మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుందట. దీంతో ఇటీవల రేసులో వెనుకబడిన పూజ హెగ్డే కు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే అయ్యింది.

త్వరలోనే టాలీవుడ్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతుంది. అలాగే తమిళ్, హిందీ నుంచి కూడా ఆమెకు ఆఫర్లు క్యూక‌డుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు స్వయంగా ఆమె వివరించింది. అనుకోని కారణాలవల్ల కొన్ని సినిమాలు మిస్అయ్యాయన‌ని.. తెలుగు ఇండస్ట్రీలో తిరిగి ఆమెకు మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉంది అంటూ పూజా హెగ్డే తన స్నేహితులతో చెప్పినట్లు టాక్.

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)