అలాంటి రాత్రులు ఎన్నో భరించాను.. కన్నీళ్ళతో రకుల్ ఎమోషనల్ పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ మొదట కెరటం అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలలో నటించి అది తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్గా దూసుకుపోయింది. ఈ మధ్యకాలంలో ఈమెకు సినిమా అవకాశాలు తెలుగులో తగ్గిన బాలీవుడ్ లో మాత్రం ఏడాదికి ఆరు సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ తన సినీ ప్రయాణం గురించి ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ రాసుకుంది. వాటి గురించి తెలుసుకుందాం.

Rakul Preet Singh's jaw-dropping transformation is an inspiration, see pics

తను నటిస్తున్న ఒక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రకుల్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుపుతుంది. ఒక ప్రమోషన్స్ లో భాగంగా భూమి ఫడ్నేకర్ తన సిని కెరియర్ గురించి తన సినీ జీవితం గురించి ఒక పోస్ట్ పెట్టడంతో పాటు ఆ తర్వాత అనిల్ కపూర్ రకుల్ ప్రీతిసింగ్ లను కూడా ట్యాగ్ చేస్తూ వారి సినీ ప్రయాణాన్ని తెలియజేయాలంటూ కోరింది.. దీంతో రకుల్ తాను చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి రావాలని చాలా కలలు కన్నాను సినీ రంగం గురించి అసలు ఏమీ తెలియని రోజుల్లోనే మోడలింగ్ లోకి ప్రవేశించాను.. అక్కడి నుండి మిస్ ఇండియా సినిమా జర్నీ స్టార్ట్ అయ్యిందని తెలిపింది..

అందరిలాగానే ఈ ప్రయాణంలో చాలా ఎత్తు పల్లాలు తిరస్కరణలకు గురైనట్లు తెలిపింది సినిమా ప్రయత్నంలో భాగంగా కుటుంబాన్ని కూడా వదిలేసి ముంబైలో అడుగు పెట్టాను ఒంటరిగా ప్రయాణించాను.. సినిమాల కోసం ఆఫీసులో చుట్టూ తిరిగాను క్యూ లైన్ లో నిలబడడం జరిగింది..కొన్ని సినిమాలకు సైన్ చేసి ఓకే అనే లోపు రాత్రికి రాత్రే తన ప్లేసులో వేరే హీరోయిన్స్ ని తీసుకురావడం జరిగిందని తెలుపుతోంది రకుల్.. దీంతో ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపానని ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నానని చివరికి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసులు ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నానని తెలిపింది.

తన జీవితంలో ఈ స్థాయికి రావడానికి కుటుంబం తనకి అండగా నిలబడిందని ఒక నోటు రాసుకు వచ్చింది రకుల్..ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)