స్కంద మూవీ ని రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటించిన మూవీ స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవ‌ల‌(సెప్టెంబర్ 28) ప్రేక్షకుల ముందు వచ్చి ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మొదటి ఫోతోనే కలెక్షన్స్‌ ఊచ కోత మొదలెట్టింది. ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలు ఓపెనింగ్ అదిరిపోయాయని చెప్పాలి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటిరోజు రూ.10 కోట్ల రూపాయల గ్రాస్ వ‌సులు ద‌క్కించుకుందట. ఇక ఈ సినిమాని బోయపాటి శ్రీను ముందుగా ఓ స్టార్ హీరోతో తెర‌కెక్కించాలనుకున్నాడట.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్. కాని అల్లు అర్జున్ అప్పటికి పుష్పాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి క్రేజ్‌ దక్కించుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇమేజ్‌ వచ్చింది కాబట్టి.. ఆరెంజ్‌కి త‌గ్గా కథతో రా కచ్చితంగా చేద్దాం ఇప్పుడు ఇలాంటి కథలు వద్దు అంటూ చెప్పేసాడట. దీంతో ఈ ప్రాజెక్టుని రామ్‌తో చేశాడు బోయపాటి. పుష్ప సినిమా తర్వాత నిజానికి ఈ సినిమానే మొదలవ్వాలి. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సరైనోడు సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. అల్లు అర్జున్ మరో లెవల్‌కి తీసుకెళ్ళింది.

తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాతో అప్పటి వరకు కేవలం యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేసిన అల్లు అర్జున్ పూర్తిస్థాయి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం థియేటర్స్ లోనే కాదు టీవీలో టెలికాస్ట్ అయినా కూడా ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే అలాంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటితో పాన్ ఇండియా ఇమేజ్ కి సరిపోదనే రీజ‌న్ వల్ల కథ బాగున్న సరే రేంజ్ కు తగ్గట్టు లేదని చెప్పి రిజ‌క్ట్ చేయ‌టం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.