ఐశ్వర్య రాజేష్ .. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకుని తద్వారా వచ్చిన పాపులారిటీతో తెలుగులో కూడా సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది . తాను నటించిన సినిమాలు జనాలు చూసే విధంగా ఉండేలా చూస్ చేసుకునే ఐశ్వర్య రాజేష్ కు తెలుగు స్టార్ హీరోలు అవకాశం ఇవ్వడం లేదు .
సినిమా హిట్ కొట్టినా సరే ఎందుకో అమ్మడు ను ఆమడ దూరం పెడుతున్నారు . అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐశ్వర్య రాజేష్ ” స్టార్ హీరోలు తమ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకోవాలి అంటే కచ్చితంగా మార్కెట్ చూస్తారని ..నాలాంటి హీరోయిన్స్ కి.. పెద్దగా మార్కెట్ ఉండదని.. ఆ కారణం చేతనే నాకు అవకాశాలు ఇవ్వడం లేదేమో “అంటూ అభిప్రాయపడింది .
అంతేకాదు అవకాశాలు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. నేను హీరోలు లేకుండానే నటించి హిట్ కొడతాను అన్న ధీమా వ్యక్తం చేసింది . దీంతో తెలుగు హీరోలు కూడా ఈ విధంగా ఆలోచిస్తారా అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు మన హీరోలకి అందం ఉంటే చాలు నటించే టాలెంట్ అవసరం లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు..!!