యంగ్ బ్యూటీ రితిక సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వెంకటేష్ ‘ గురు ‘ సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించింది. ఇటీవల మళ్ళీ చాలా రోజుల తర్వాత దుల్కర్ సల్మాన్ ” కింగ్ ఆఫ్ కోతా ” లో కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ”
ప్రతి రెండు గంటలకు ఏదో ఓ మూల మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. వార్తల్లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతిసారి నా రక్తం మరిగిపోతోంది. ఈ దారుణాలు ఇంకెప్పుడు ఆగుతాయి. మహిళలపై అత్యాచారాలు ఆగాలంటే మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ప్రతి బిడ్డకు సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వాల్సిన సమయం వచ్చింది.
ఇలాంటి దారుణాలు తట్టుకుని ఈ సమాజంలో నిలబడాలి అంటే మన పిల్లలతో జరుగుతున్న ఘటనలపై చర్చించాలి. ఇలాంటివి చిన్నపిల్లలతో చర్చించడం కష్టమైనప్పటికీ వారి భవిష్యత్తు కోసం మనం మారాలి. మన భవిష్యత్ తరాల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మహిళలంతా ఇలాంటి దారుణాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి ” అంటూ రాసుకు వచ్చింది. ప్రస్తుతం ఈమె ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram