అందమైన, సన్నని పెదాలను ఏ అమ్మాయి కోరుకోదు? పెదవులు వారి మొత్తం ముఖ సౌందర్యంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పెదవల ఆకృతి సహజంగా ఉంటుంది. అయితే మీ పెదవులు కొంచెం మందంగా ఉంటే వాటిని కాస్త పలుచగా మార్చుకోవచ్చు. మీరు కూడా సన్నని పెదాలు కావాలనుకుంటే సులభమైన చిట్కాలను పాటించండి.
వ్యాయామం:
మీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు మీరు తప్పనిసరిగా అనేక రకాల వ్యాయమాలు చేయాల్సి ఉంటుంది. కానీ పెదాలకు పదును పెట్టడానికి కూడా వ్యాయామాలు సహాయపడతాయి. అటువంటి పరిస్థితుల్లో ఫేషియల్ యోగ చాలా ప్రధానంగా పనిచేస్తుంది. దీనికోసం రెండు పెదాలను కలిపి 20 సెకన్ల పాటు నొక్కి ఉంచండి.ఆ తరువాత నూనె అప్లై చేయండి. పెదవులని అటూ ఇటూ కదుపుతా ఉండండి. ఇలా మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే సన్నని పెదాలు మీ సొంతం.
బట్టర్ అప్లై చేయడం:
మీరు మీ పెదాలను తేమ చేయడానికి, పోషణకు వెన్నను ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, ఆలివ్ నూనె కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నూనెను మీ పెదాలపై క్రమం తప్పకుండా రాయండి. ఫలితం మీకే తెలుస్తుంది. డెడ్ స్కిన్ పేరుకుపోవడం వల్ల, పెదవులు పెద్దగా, మందంగా కనిపిస్తాయి. దీనికోసం మీరు స్ర్కబ్ సమయంలో డెడ్ స్కీన్ ను తొలగించుకోవాలి. అయితే పొడి పెదాలను వదిలించుకోవడానికి అనేక ఇతర చిట్కాలు కూడా తీసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ పెదవులలో తేడా కనిపిస్తుంది.