బుల్లితెర యాంకర్ గా బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్.. ఏ షోలో అంటే..?

బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన‌వసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించిన దానికంటే తన అందాలతో నెట్టింట ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.

తాజాగా, సన్నీ లియోన్‌కి సంభందించిన ఓ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. తొలిసారి సన్నీలియోన్ బుల్లితెరపై ఓ షోలో కనిపించనుంది. ఆమె జీ తెలుగు కోసం ” తెలుగు మీడియం స్కూల్ ష‌ అనే కొత్త రియాలిటీ షోను హోస్ట్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో సన్నీలియోన్ సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఈ ప్రోమోలో సన్నీలియోన్ తో పాటు ప్రముఖ గాయకుడు మను, యాంకర్ రవి కూడా సందడి చేశాడు. అంతే కాదు ఇందులో టాలీవుడ్ హాస్య నటులు సైతం ఉన్నారు. దీంతో ఇది చూసిన ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మ సుమ, రష్మీ, అనసూయ‌, శ్రీముఖి వంటి యాంకర్స్ ని కొల్లగొట్టడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.