స్కంద‌ సినిమా ఓటీటీ రిలీజ్ టైం అప్పుడేనట..

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో స్కంద‌ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. వసూళ్ల ఊచకోతతో అదరగొడుతున్న స్కంద మూవీకి ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక స్కంద మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

మాస్ ప్రేక్షకులకు పండగలు అనిపించిన స్కంద మూవీకి ప్రేక్షకుల్లో భారీ మెజారిటీ ఉంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా స్కంద‌ 2 రాబోతుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సెకండ్ హాఫ్ లో శ్రీకాంత్, రామ్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేశాయి. స్కంద సినిమాతో బోయపాటి శ్రీను రేంజ్ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు.

అయితే స్కంద ను ఏడు , ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇప్పటికే థియేటర్స్ లో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న స్కంద మూవీ ఓటీటీలోకి వచ్చిన తరువాత ఏ రేంజ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి. ఇక ఇప్ప‌టికే యాక్ష‌న్ మార్క్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున బోయ‌పాటి స్కంద కి రూ.25కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడ‌ట‌.