పవన్ కళ్యాణ్ తను వాడిన గుడుంబా శంకర్ ప్యాంట్‌ను ఆ స్టార్ హీరోకి గిఫ్ట్ గా ఇచ్చాడా..!

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ఏ సినిమా చూసిన ఏదో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాడు. అలా ఒక‌ప్పుడు ప‌వ‌న్ న‌టించిన‌ గుడుంబా శంకర్ డబల్ ప్యాంట్స్ ఎంతటి సంచలన సృష్టించాయో అందరికీ తెలిసిందే. అలాంటి దుస్తులు కూడా వేసుకుంటారా అని అందరూ షాక్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ తన కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకున్నాడు.

 

అప్పట్లో యూత్ మొత్తం అదే స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో కూడా ఇంతే ఇది కూడా అప్పట్లో ఓ ట్రెండ్‌లా న‌డిచింది. ఇలాంటి క్రేజీ ఆలోచనలు కేవలం పవన్ కళ్యాణ్‌కి వస్తాయి. డిజైన్, స్టైలిఫింగ్ మొత్తం చేసింది రేణు దేశాయి అయినా ఐడియాస్ మాత్రం పవన్ కళ్యాణ్‌వేన‌ట‌. అయితే ఈ ప్యాంట్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ మరియు బాలు సినిమాలో వేసుకున్న తన పాంట్స్‌ని తన మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌కి గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇక సాయిధరమ్ తేజ్ కూడా తను నటించిన‌ మొదటి సినిమా రేయ్‌లో ఈ ప్యాంట్‌ని వాడడం మనం గమనించవచ్చు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో.. ఈ చిన్న అంశం బయటికి రాలేదు. ఇక సెప్టెంబర్ 2 అంటే రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు గుడుంబా శంకర్ రీ రిలీజ్ జరుగుతున్న సందర్భంగా ఫ్యాన్స్ ఈ రేర్ పాయింట్‌ని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.