అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జుననా.. కార‌ణం అదేన‌ట‌..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ” సూపర్ ” సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అనుష్క..” బాహుబలి ” సినిమాతో దేవసేనగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగార్జున హీరోగా వచ్చిన ” సూపర్ ” మూవీలో అనుష్క సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అంతేకాదు అప్పట్లో ఆయన అనుష్కతో రిలేషన్ లో ఉండటం వల్ల ఆఫర్స్ కూడా ఇప్పించాడని టాక్ నడిచింది. కానీ అనుష్క తనకు తానుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని అవకాశాలు తెచ్చుకుందని విమర్శకులు ఒప్పుకోక తప్పలేదు.

అయితే కెరీర్ లో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ… పెళ్లి విషయంలో మాత్రం వెనకడుగు వేసింది. దీంతో నాగార్జునతో ఆమె ఇంకా రిలేషన్ లో ఉండటం వల్లే.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అనుష్క రియాక్ట్ అవ్వాల్సిందే.