ఈ మధ్యకాలంలో మన తెలుగు టాప్ హీరోలతో మలయాళ ఇండస్ట్రీ నటులు విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మరో మలయాళ నటుడు సుదేవ్ నాయక్ కూడా ఇప్పుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో విలన్ గా తెలుగు సినీ పరిశ్రమపై అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. రవితేజ, డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ” టైగర్ నాగేశ్వరరావు “.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో నుంచి హీరో క్యారెక్టర్ తో పాటు మురశీ శర్మ, అనుపమ్ ఖేర్ పాత్రలను టీజర్ ద్వారా పరిచయం చేయగా… ఇప్పుడు విలన్ క్యారెక్టర్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
అదే మలయాళ నటుడు సుదేవ్ నాయక్ పోషించిన కాశీ పాత్ర. ఈ మేరకు ” స్టూవర్ట్పురంలో తిరుగులేని యువరాజు ” కాశి ” నీ కలవండి. సుదేవ్ నాయర్ చూడగలిగే ప్రతిభ అండ్ అతను తన అద్భుతమైన నటనతో మీ అందరిని ఆశ్చర్యపరుస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. ” టైగర్ నాగేశ్వరరావు ” ట్రైలర్ అక్టోబర్ 3న రాబోతుండగా.. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది” అంటూ ట్విట్ చేశారు.