హీరో సిద్ధార్థ్ కు క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్.. కారణం అదేనా..?

టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా విలక్షణమైన నటుడుగా ప్రకాష్ రాజ్ మంచి పాపులారిటీ సంపాదించారు.. విలన్ గానే కాకుండా హీరోగా సైడ్ క్యారెక్టర్లలో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన ప్రకాష్ రాజ్.. పాత్ర ఏదైనా సరే ఆయన ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు ఇటీవలే రాజకీయంగా కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటున్న ప్రకాష్ రాజ్ ముఖ్యంగా బీజేపీని మోడీని విమర్శించి మాట్లాడడంలో ఎప్పుడు ముందే ఉంటారు.

On behalf of Kannadigas...': Prakash Raj on Siddharth's press meet  disruption - India Today

అయితే ఈ మధ్యనే చంద్రమోహన్-3 ప్రయోగం పై కూడా ప్రకాష్ రాజు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారారు.. చిత్త అనే ఒక ప్రమోషన్స్ కోసం బెంగళూరుకు వెళ్లిన సిద్ధార్థ్ ను కొంతమంది నిరసనకారులు అక్కడ అడ్డుకున్నారు.. కావేరి నది జలలకు సంబంధించిన వివాదం జరుగుతున్న నేపథ్యంలో గత శుక్రవారం నుంచి కర్ణాటక లో బందుకు పిలుపునిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సిద్ధార్థ్ ప్రెస్ మీట్ పెట్టడంతో ఆగ్రహానికి గురైన కొంతమంది నిరసనకారులు ఆ ప్రెస్ మీట్ను అడ్డుకున్నారు.

దీంతో అక్కడి నుంచి సిద్ధార్థ్ నవ్వుతూ వినతిరిగిపోయాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.తాజాగా ప్రకాష్ రాజ్ ఈ వీడియో పైన ఫైర్ అవుతూ.. సిద్ధార్థ్ కు సారీ చెబుతూ ట్వీట్ చేశారు..ఎన్నో దశాబ్దాల నాటి ఈ సమస్య పరిష్కరించడంలో విఫలమైన అన్ని రాజకీయ పార్టీ నాయకులను ప్రశ్నించకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని ఒత్తిడి చేయని ఈ పనికిమాలిన పార్లమెంటులను ప్రశ్నించకుండా.. సామాన్యులను కళాకారులను ఇలా ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు అంటూ.. కన్నడిగుడిగా.. కన్నడిగుల తరఫున సిద్ధార్థ్ క్షమించు అంటూ ఒక ట్విట్ చేశారు ప్రకాష్ రాజ్.