మెగా హీరోతో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి టీమ్..!!

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ కృతి శెట్టి.. తన మొదటి సినిమాతోనే రూ .100 కోట్ల క్లబ్బులో చేరిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అయితే ఈ మధ్యకాలంలో ఇమే నటించిన సినిమాలన్నీ కూడా అవడంతో ఈమె గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఇలాంటి సమయంలో కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తన హవా కొనసాగించాలని చూస్తోంది కృతి శెట్టి

Vaisshnav Tej to work again with Krithi Shetty

అయితే గత వారం రోజుల నుంచి ఉప్పెన హీరో వైష్ణవి తేజ తో ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఈ వార్తలు నిజం అనే విధంగా మెగా అభిమానుల సైతం సంబరపడిపోయారు. అయితే తాజాగా ఈ విషయం పైన కృతి సెట్టి టీమ్ స్పందించినట్లుగా తెలుస్తోంది. కృతి శెట్టి టీమ్ మాట్లాడుతూ.. కృతి శెట్టి పైన వస్తున్న రూమర్లలో ఎలాంటి నిజము లేదు కావాలనే కొంతమంది ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారంటూ తెలియజేసింది.

 

కృతి శెట్టి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోలేదు ఇవన్నీ కేవలం వట్టి పుకార్లే అన్నట్లుగా తెలియజేసింది. ప్రస్తుతానికి ఈమె ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉన్నట్లు తెలియజేసింది కృతీ శెట్టి టీమ్.. దీంతో కృతి శెట్టి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.. మరి ఇంతటితోనైనా ఈ విషయం ఆగిపోతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు ఈ ముద్దుగుమ్మ.