అది నిజమేగా… హీరోయిన్ రష్మిక పై సెన్సేషనల్ కామెంట్ చేసిన మాజీ బాయ్ ఫ్రెండ్‌..!!

కన్నడ హీరో రక్షిత్ శెట్టి ” చార్లీ 777 ” మూవీ తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం శాండల్ వుడ్ బ్లాక్ బస్టర్ హిట్ “సప్త సాగరాలు దాటి ” సినిమాలో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్యూర్ లవ్ ప్టోరీ అంటూ ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న సినిమా గురించి ప్రమోషన్స్ కొనసాగిస్తున్నాడు రక్షిత్.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలు రష్మిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ట్యాగ్ గురించి మీడియాలో పదే పదే రావడంపై తన ఒపీనియన్ ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ” అది నిజమే కదా… అల ఉండనివ్వండి ” అని సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు.

అటు రష్మిక మందన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా నిలిచింది. ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమాలో బిజీగా ఉంది. ఇక వీరిద్దరి బ్రేక‌ప్ తర్వాత రష్మిక.. విజయ్ దేవరకొండ తో లవ్ ట్రాక్ నడుపుతుంది అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.