బిగ్ బాస్ బ్యూటి రతిక, రాహుల్ మ‌ధ్య అలాంటి రిలేష‌న్ షిప్ ఉందా.. ఇనాళ్ళ‌కి రివీలైన సీక్రెట్‌..

బిగ్ బాస్ సీజన్ 7 ఆట రసవత్తంగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ అసలు ఆట మొదలు పెడుతున్నారు. మొదటి రెండు రోజులు మొహమాటం ప్రదర్శించిన ఇప్పుడు బయటపడి మాట్లాడేస్తున్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం.. ఎదుటి వారిపై ఫైర్ అవ్వడం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రవర్తన రెండో వారంలో స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సీజన్లో మాత్రం రెండు రోజులకే ప్రారంభించారు. చిన్నగా గ్రూపులు కూడా ఫామ్ అవుతున్నాయి. ఈ సీజన్లో కంటెస్టెంట్ గా ఉన్న రతిక రోజ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరూ ఆమె అందం, ఆట తీరు, హుషారు చూసి ముచ్చట పడుతున్నారు.

సినిమా హీరోయిన్ అయినా ఎంతో సింపుల్ గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రతిక ఏడేళ్ల కిందటే బుల్లితెర ప్రేక్షకులకి సుపరిచితమే. అప్పట్లో పటాస్ షోలో ప్రేక్షకులను తెగ నవ్విచ్చేసింది. ఆ తర్వాత హీరోయిన్ కూడా అయింది. అయితే చాలామందికి రతిక ప‌టాస్‌ చేసింది అని తెలియదు. బిగ్ బాస్ లోకి వచ్చిన రతిక పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో భాగంగానే ఒక న్యూస్‌ ఎక్కువగా వినిపిస్తుంది. రతిక, రాహుల్ సీప్లిగంజ్ రిలేషన్ ఏంటి? అసలు వీళ్ళిద్దరూ ఏమవుతారు? ఈమె రాహుల్ సీప్లిగంజ్‌తో ఓ సాంగ్ చేసింది.

ఆ టైమ్‌లో వీళ్ళ ప్రేమ చిగురించింది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరూ రెండేళ్ల కిందట విడిపోయారు. బిగ్ బాస్ లో రతికాని గార్డెన్ ఏరియాకి పిలిచి.. ఎవరినైనా మిస్ అవుతున్నారా అని అడిగితే.. ఎవరైనా అమ్మ, నాన్న అని చెబుతారు. కానీ నేను ఆ పర్సన్ ని మిస్ అవుతున్నాను అని ఎమోషనల్ అవుతుంది. మీకోసం బిగ్ బాస్ ఒక సాంగ్ ప్లే చేస్తామని ‘ పిల్ల.. పిల్ల.. భూలోకం దాదాపు కన్నుమూయువేల’ రాహుల్ పాడిన సాంగ్ ని ప్లే చేస్తాడు. రతిక సాంగ్ ని విని చాలా ఎమోషన్ అయిపోతుంది. మరి వీరిద్దరి మధ్య ఎందుకు మనస్పార్ధాలు వచ్చాయో రతిక చెప్పాల్సి ఉంది.