స్టార్ హీరోయిన్ బ‌యోపిక్‌లో బేబీ హీరోయిన్ వైష్ణ‌వి… న‌క్క తోక తొక్కేసింది..!

సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి చాలామంది కష్టపడిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అయితే ఇటీవల వచ్చిన హీరోయిన్లు దీనికి భిన్నంగా వచ్చిన కొద్ది రోజుల‌కే త‌మ క్రేజ్ చాటుతున్నారు. అలా చిన్న యూట్యూబ్ ఛానల్‌లో.. వెబ్ సిరీస్, సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకటి.

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మంచి ఫామ్ లోకి వచ్చింది. తాజాగా ఏ స్టార్ హీరోయిన్ దక్కించుకోలేని ఓ అరుదైన అవకాశం బేబీ కి వచ్చినట్టు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న వైష్ణవి చైతన్యకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాల్లో రెండు కధ‌లకు వైష్ణవి ఓకే చేపిందట. ఈ క్రమంలోనే ఓ అరుదైన అవకాశం కూడా ఆమె వద్దకు వచ్చిందంటూ న్యూస్ వినిపిస్తుంది.

దివంగత నటి స్టార్ హీరోయిన్‌ సౌందర్య బయోపిక్ తీస్తున్నారట. ఆ సినిమా మెయిన్ లీడ్ లో నటించే ఛాన్స్ వైష్ణవి కి వచ్చినట్లు సమాచారం. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడంతోపాటు అచ్చ తెలుగు అమ్మాయిల సాంప్రదాయకళ‌ ఉట్టిపడే విధంగా వైష్ణవి ఉంటుంది. దీంతో ఈ అవకాశం వైష్ణవికి వరించిందంటూ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ నిజంగానే సౌందర్య బయోపిక్ వస్తే బాగుండు అని సౌందర్య ఫ్యాన్స్ అంతా ఆశ పడుతున్నారు. ఈ అమ్మ‌డు న‌క్క తోక తొక్కేసుంటుంది అంటు కామెంట్స్ చేస్తున్నారు.