BIGG BOSS 7: నాలుగో హౌస్ మేట్ గా రైతుబిడ్డ.. ముఖం మాడ్చుకున్న రతిక..

బిగ్‌బాస్ 7 స్టార్ట్ అయిన దగ్గరనుంచి ఎంతో రసవతారంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో మొదటి నుంచే కంటెస్టెంట్ల మధ్యన వార్ స్టార్ట్ చేశాడు బిగ్‌బాస్. విచిత్రమైన టాస్కులు పెడుతూ వారి మధ్యన గొడవలను పెంచేస్తున్నాడు. ఇక ఇటీవల తాజా ఎపిసోడ్‌లో ఫన్నీగా రెడీ అవ్వమని టాస్క్ ఇచ్చాడు. అందరూ బాగా రెడీ అయ్యారు. అప్పటికే యావర్, ప్రశాంత్ కంటెండర్స్ అయ్యారు. మరో కంటెండ‌ర్‌ను నిర్ణయించే బాధ్యతను హౌస్‌మేట్ శివాజీ, సందీప్, శోభాశెట్టికి ఇచ్చాడు బిగ్ బాస్. కంటిస్టెంట్స్ దానికోసం బిగ్ బాస్ హౌస్ లో వస్తువులను ఉపయోగించుకొని రెడీ అవమని చెప్పాడు.

హౌస్ మేట్స్ ఆ విధంగా పోటీపడి మరి ఒకరిని మించి ఒకరు రెడీ అయ్యారు. వారిలో నుంచి శుభశ్రీని విజేతగా ప్రకటించారు కంటెస్టెంట్స్. త‌ర్వాత కంటెంట్స్ అయినా యావర్, ప్రశాంత్, శుభశ్రీ మధ్య పోటీ మొదలైంది. పవర్అస్త్రాను వదలకుండా ముగ్గురులో ఎవరు ఎక్కువ‌సేపు పట్టుకుంటే వారు హౌస్మెట్ అయ్యే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పాడు. దానికోసం శివాజీని సంచాలకుడిగా వ్యవహరించమని తెలిపాడు. దీంతో యావర్, ప్రశాంత్, శుభ శ్రీ ముగ్గురు చాలా సేపటి వరకు దానిని వదలకుండా పట్టుకున్నారు. ప్రశాంత్‌ని డిస్టర్బ్ చేయడానికి అమర్, ర‌తిక అతన్ని హేళన చేస్తూ ఎంతో కామెంట్ చేశారు.

అయినా పవర్ వస్త్రాన్ని వదిలిపెట్టకుండా పట్టుదలగా అలాగే నుంచున్నాడు ప్రశాంత్. ఇక చాలాసేపు అయినా ఎవరూ పవరాస్త్రాన్ని వదలకపోవడంతో శుభశ్రీ యావర్‌ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. యావర్ కన్విన్స్ అవ్వకుండా తాను ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చాన‌నాడు. పల్లవి ప్రశాంత్ కూడా మరోసారి కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో ఈ టాస్క్ ముగియలేదు. దీంతో బిగ్ బాస్ టాస్క్ ను ఆపేసి కొత్త టాస్క్‌ ప్రవేశ పెట్టాడు. మూడు స్టిక్స్ పెట్టి వాటికి చివర్లో పవర్‌అస్త్రాన నిల్చబెట్టాలని ఎవరు ఎక్కువ సేపు నిలపగలుగుతారో వారే ఈ టాస్క్ విన్నర్ అంటూ నాలుగో కంటిస్టె్ంట్‌గా.. టాస్క్ విన్నర్ నిలుస్తాడు అంటు చెప్పుకొచ్చాడు బిగ్‌బాస్.

దీంతో ఆ కర్రలపై పవర్‌అస్త్రా నిలబెట్టారు. ముందుగా శుభ శ్రీ పవర్ అస్త్ర కింద పడిపోయింది. తర్వాత కొంతసేపటికి యావర్ పవర్ అస్త్ర కూడా పడిపోయింది. అయితే ప్రశాంత్ పవరాస్త్రం మాత్రం చివరిగా కింద పడింది. దీంతో ప్రశాంత్ పవరస్త్రాను గెలుచుకొని నాలుగో కంటెస్టెంట్ గా మారాడు. అయితే ప్రశాంత్ పవర్‌అస్త్రాన్ని గెలుచుకోవడం పై హౌస్ మేట్స్ ఎవరు సంతోషపడినట్టు కనిపించలేదు. ర‌తికా అయితే మొఖం మాడ్చుకొని అమర్దీప్ వైపు చూస్తూ.. ప్ర‌శాంత్‌ అర్హుడు కాదు అన్నట్లు లుక్ ఇచ్చింది.