అద్దె లో కూడా తగ్గేదేలే అంటున్న సల్మాన్.. !

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వయసు ముదురుతున్నా పెళ్లికి మాత్రం దూరం అంటున్న ఈయన సినిమాల ద్వారా భారీగానే సంపాదించారనే చెప్పాలి. ఇక అంతే కాదు తనతో క్లోజ్ గా ఉండే వారికి కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా తాజాగా ముంబైలో అతి కాస్ట్లీ ఏరియాలో ఉన్న ఒక ఇంటిని తాజాగా ఆయన రెంట్ కి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇంటి కి అద్దె ఎంత వసూలు చేస్తున్నాడో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

Contrary To Reports, Salman Khan Is NOT Moving Out Of Galaxy Apartments!

ఇకపోతే బాలీవుడ్ లో అత్యంత సంపన్నులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ లగ్జరీ లైఫ్ , ఆయన ఫార్మ్ హౌస్ , కార్లు, పార్టీలు.. దాంతోపాటు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్న ఆయనకు ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ, సొంత సెక్యూరిటీ ఇలా అన్నింటికీ కూడా భారీ ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ విలాసవంతమైన గెలాక్సీ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. అంతేకాదు ముంబైలో భారీగా ఆస్తులను కూడా కలిగి ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో ఒకదానిని రెంట్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆయన ముంబైలోని శాంతాక్రజ్ లో తన ప్రధాన వాణిజ్య ప్రాపర్టీల్లో ఒకదానిని అద్దెకు ఇస్తున్నారట. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా అయిపోయినట్లు సమాచారం.

 

ఆగస్టు నెల నుండి 60 నెలల టైం డ్యూరేషన్ లో ఈ రెంటల్ అగ్రిమెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. భవనంలోని కింది అంతస్తు, గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తు, రెండవ అంతస్తులను సల్మాన్ ఖాన్ కలిగి ఉండగా.. మొదటి సంవత్సరంలో ఈ భవనం నెల అద్దె రూ.90 లక్షలు. ఇక రెండవ సంవత్సరంలో రూ .1 కోటికి చేరుకుంటుందని.. తదుపరి సంవత్సరాలలో ఈ మొత్తానికి మరో రూ .5లక్షలు పెరుగుతుందని సమాచారం. ఇక మూడవ సంవత్సరం రూ.1.05 కోట్లు, నాలుగవ సంవత్సరం రూ.1.10 కోట్లు, ఐదవ సంవత్సరం రూ.1.15 కోట్లు అని సమాచారం మొత్తానికైతే అద్దె విషయంలో కూడా తగ్గేదేలే అంటూ ప్రవర్తిస్తున్నారు సల్మాన్ ఖాన్.