అనారోగ్య విష‌యంలో స‌మంత‌ కంటే ఎక్కువ నరకం నేను చూశా.. న‌టి సంచ‌ల‌న వ్యాక్య‌లు..!!

టాలీవుడ్ నటి శ్రీ సుధా తక్కువ సినిమాల్లో నటించినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ‘ అర్జున్ రెడ్డి ‘ మూవీలో సుధా క్యారెక్టర్ చాలా బోల్డ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె మాట్లాడుతు.. సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు లేకుండా చేస్తామని బెదిరింపులు వచ్చాయి.

ఈ వివాదం వల్ల కొన్ని సినిమాలు కూడా మిస్ అయ్యాను అంటు చెప్పుకొచ్చింది. ఇక వచ్చే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కెరీర్ కావాలంటే డబ్బులు మాత్రమే కాదు గుర్తింపునిచ్చే సీన్లు కూడా ఉండాలి. క్యాస్టింగ్ కౌచ్‌కి నేను వ్యతిరేకం. నా విషయంపై సామ్ కె నాయుడు ఇంటి దగ్గర ఎన్నిసార్లు గొడవలు చేశానో నాకే తెలుసు. ఇక మా బాబుకు కూడా మొత్తం తెలుసు. వాడి పాపాన వాడే పోతాడు అనేవాడు.

మా బాబు ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు అంటు వివ‌రించింది. ఆమె త‌న స‌మ‌స్య‌ల‌ని చెప్తు ఇంకా చెప్పాలంటే సమంత కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలతో నేను బాధపడుతున్నా. ఈ వ్యాధుల వల్ల నరకం చూస్తున్నా. వాష్ రూమ్ పక్కనే ఉన్నా.. బెడ్ దిగి వెళ్లడానికి నాకు కనీసం రెండు గంటలు పడుతుంది. ఇప్పుడు మీతో ఇలా మాట్లాడినందుకు రేపు మొత్తం రెస్ట్ లోనే ఉంటాను ” అంటూ చెప్పుకొచ్చింది సుధ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.