బేబీ మూవీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన హైదరాబాద్ కమిషనర్.. కేసు నమోదు చేస్తామంటూ..!!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించిన మూవీ బేబీ. ఈ సినిమా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. కోట్లాదిమంది కుర్ర కారును ఆకట్టుకున్న ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో రిలీజై రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వశుళ‌ను కొల్లగొట్టింది. దర్శకుడు సాయి రాజేష్ బోల్డ్ కంటెంట్ తో రూపొందించిన ఈ కథలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య తన నటనతో అదరగొట్టింది.

ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు కూడా క్యూక‌డుతున్నాయి. ఇదిలా ఉంటే బేబీ సినిమా కంటెంట్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఫైర్ అయ్యాడు. ఈ మూవీలో కొన్ని సీన్స్ డ్రగ్స్ కల్చర్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయని అబ్జెక్షన్ తెలియజేశాడు. బేబీ సినిమాలో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైట్స్‌ జరిగిన సన్నివేశాలు ఉన్నాయని బేబీ సినిమా యూనిట్‌కి నోటీసులు జారీ చేయబోతున్నామని ఆయన చెప్పడం సెన్సేషనల్ గా మారింది.

బేబీ సినిమా నిర్మాత ఎస్ కే ఎన్ కాగా ప్రస్తుతం ఆహలో బేబి స్ట్రీమ్ అవుతుంది. బేబీ సినిమాపై కమిషనర్ సివి ఆనంద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.