టిఆర్పి రేటింగ్ లో కొత్త రికార్డు సృష్టించిన బిగ్ బాస్ 7.. స్టార్ మా పోస్ట్..!

బిగ్ బాస్ ఇప్పటికే 6 సీజన్స్ పూర్తిచేసుకుని 7 సీజన్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్‌గా 7వ సీజన్లో వ్యవహరిస్తున్నాడు. రెండో వారంలో హౌస్ మెట్స్ తో ఆట ఆడిస్తున్నాడు బిగ్ బాస్ నాగార్జున చెప్పిన ఉల్టా పల్టా గేమ్‌తో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నారు హౌస్ మేట్స్.

గత సీజన్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిన విషయమే. దీంతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగాలని కొత్త కొత్త రూల్స్ పెట్టాడు. బిగ్ బాస్ ఉల్టా పల్టా కంటెంట్ తో డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఈ రియాల్టీ షో సక్సెస్ అయినట్లే అనిపిస్తుంది. స్టార్ట్ అయిన రెండు వారాల్లోనే 18.1 టిఆర్పి సాధించింది అంటూ స్టార్ మా పోస్ట్ షేర్ చేసుకుంది. ఈ మేరకు బిగ్ బాస్ స్పెక్టాక్యులర్ కం బ్యాక్ ఇచ్చేసింది అని చెప్పుకోవచ్చు.

ఎలక్ట్రిఫైయింగ్ బ్యాంగ్‌తో లాంచ్ అయిన రియాలిటీ షో కొత్త రికార్డులను సృష్టించింది. 18.1 టిఆర్పిను అచీవ్ చేసుకుంది అంటూ ట్విట్ చేశారు స్టార్ మా బిగ్ బాస్ టీం. దీంతో బిగ్ బాస్ అభిమానులు షోను చూసి ఎందుకు మరింత ఎగ్జిట్ అవుతున్నారని క్లారిటి వ‌చ్చింది.