చేజేతులారా బ్లాక్ బస్టర్ మూవీని వదిలేసుకున్న కాజల్ అగర్వాల్..!!

నాచురల్ స్టార్ నాని కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలు ఉన్నాయి. అలాంటి సినిమాలలో నిన్ను కోరి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఇందులో నానికి జోడిగా నివేద థామస్ నటించింది. మరొక హీరో ఆది పినిశెట్టి కూడా నటించారు. ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథాంశం తో పాటు ఎమోషనల్ తో కావలసినంత కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించింది.

Kajal Aggarwal for Nani's next?

ఈ చిత్రంలోని పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మరింత సక్సెస్ను తెచ్చిపెట్టాయి. ఇందులో నాని నటన కూడా అందరిని ఆకట్టుకున్నది. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా నివేద థామస్ ని అనుకోలేదట చిత్ర బృందం. ఆమె ప్లేస్ లో మరొక హీరోయిన్ని అనుకున్నారట డైరెక్టర్ శివ నిర్వాణ. ముందుగా టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నారట.కానీ కాజల్ అగర్వాల్ నాని కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు.

Ninnu Kori Telugu Movie Review with Rating | cinejosh.com

కానీ వరుసగా సినిమాలతో బిజీగా ఉండడంవల్ల కాజల్ అగర్వాల్ నిన్ను కోరి సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నాని ప్రొడక్షన్ హౌస్ లో కాజల్” ఆ “అనే చిత్రంలో నటించింది. వివాహమై ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలయ్యతో భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తోంది. నాని కూడా ఈ ఏడాది దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు.