రాత్రి భోజనం ఏ సమయంలో తినాలి.. ఆలస్యంగా తింటే ఇంత ప్రమాదమా….!!

మారుతున్న జీవనశైలి కారణంగా భోజనం సమయంలో చాలా మార్పులు వచ్చాయి. సరైన సమయంలో కాకుండా ఎప్పుడోఅప్పుడు తినేస్తున్నారు. దీనికి కారణంగా చాలామంది బరువు పెరగడం, ఉబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రాత్రి వెళ్లాలో ఏ టైం లో తినాలో తెలుసుకుందాం.

ఏవైనా కొన్ని రీజన్స్ కారణంగా రాత్రి 9 గంటలకు తినాల్సి వస్తే తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు. సాయంత్రం 6, 8 గంటల లోపు నైట్ డిన్నర్ చేస్తే మన ఆహారానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుత జీవనవిధానం వల్ల ఒక అరగంట అటు ఇటు కావచ్చు. రాత్రుళ్లు కడుపు నిండగా తింటే సరిగ్గా జీర్ణం అవ్వని కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అందుకే ఈ అలవాటు వదులుకోండి. ప్రతి ఒక్కరూ ఏదైనా తిన్న తర్వాత కనీసం 20, 25 నిమిషాలు వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి తిన్న 2,3 గంటల తరువాత మాత్రమే నిద్రపోవాలి. దీని కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యి నిద్ర బాగా పడుతుంది. కానీ చాలామంది రాత్రి తిన్న వెంటనే బెడ్ పై వాలిపోతారు. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.