మెగాస్టార్ 157 మూవీపై మ‌రో కొత్త అప్డేట్‌..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తాజాగా ఓ భారీ సోషియో ఫాంటసీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్‌లో 157వ‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

యువి క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం కానున్న.. ఈ మూవీ యెక్క కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందించనున్నాడు. ఇక ఈ మూవీలో అనుష్క ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇందులో ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్లు నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఈ మూవీలో మెగాస్టార్ రోల్ పవర్ ఫుల్ గా ఉండడంతో పాటు ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా సాగుతుందట. ఇక ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. త్వరలో ప్రారంభం కానున ఈ మూవీని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారట.