అన్ని కోట్లు ఖర్చు చేసి కారు కొన్న తాప్సి..!!

ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు అడుగుపెట్టిన హీరోయిన్ తాప్సి ఆ తర్వాత వెంకటేష్ తో షాడో, రవితేజతో వీర, ప్రభాస్ తో మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి చిత్రాలలో నటించింది.అయితే పెద్దగా ఈ సినిమాలు ఏవి కలిసి రాలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు సినిమాలలో నటించి మంచి పొజిషన్లో చేరింది. తాప్సి పలు రకాల లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా తాప్సి కొన్న కొత్త కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

लग्ज़री गाड़ी ख़रीदकर Taapsee Pannu ने की गणेश चतुर्थी की शुरुआत, इन  ज़बरदस्त फ़ीचर्स से लैस है कार

తాప్సి కొనుగోలు చేసిన కారు మెర్సీ డేస్ బెంజ్ కంపెనీకి చెందినది..GLS -600 దీని ధర సుమారుగా రూ.3 కోట్లకు పైగే ఉన్నట్లు సమాచారం .దీనిని కంపెనీ నిన్నటి రోజున ఈమె ముంబై ప్రాంతంలోని ఇంటి వద్దకు చేర్చినట్లు తెలుస్తోంది. తాప్సి గ్యారేజ్ లో చేరిన రెండవ బెంజ్ కారని చెప్పవచ్చు. ఈ బెంజ్ కార్ అధునాతన ఫీచర్స్ తో కలిగి ఉన్నది. అదిరిపోయే టెక్నాలజీ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్ కి సంబంధించిన విషయాలన్నీ డ్రైవర్ డిస్ప్లే పైన కలిగి ఉంటాయట.

.
అంతేకాకుండా సీట్స్ వెంటిలేటెడ్ సీట్లు వైర్లెస్ చార్జింగ్ రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్ కలిగి ఉన్న రియల్ సీట్స్ మొదలైన అధునాతన ఫీచర్స్ కూడా కలవు. ఇలాంటి ఖరీదైన కార్లు దీపికా పదుకొనే, రణబీర్ సింగ్ ,అజయ్ దేవగన్ ,శిల్పా శెట్టి, కృతిసనన్ ,ఆదిత్య రాయ్ కపూర్ ,రామ్ చరణ్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.