ఒకప్పుడు వీరు హీరోలు.. ఇప్పుడు మాత్రం మోస్ట్ వాంటెడ్ విలన్లు..!

ఒకప్పుడు ఇండస్ట్రీ లో హీరోలుగా ఒక వెలుగు వెలిగిన కొంతమంది నటులు ప్రస్తుతం విలన్స్ గా మరి ఆడియన్స్ ని ఏంటర్టైన్ చేస్తున్నారు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు వీరు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ విలన్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ హీరో కమ్ విలన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అరవింద్ స్వామి. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమా లో నటించాడు. ఆ తరువాత బిసినెస్ రంగం లో రాణించాడు.

ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ ధ్రువ ‘సినిమా తో విలన్ గా మారి తిరిగి ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఒకప్పుడు జగపతి బాబు సినిమా లంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అనేలా ఉండేవి. కానీ కొంతకాలనికి అవకాశాలు లేక బాలకృష్ణ హీరోగా నటించిన ‘ లెజెండ్ ‘ సినిమా గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఇక రవి కిషన్ శుక్ల అంటే ఎవరికి గుర్తు రాకపోవచ్చు కానీ ‘రేసుగుర్రం’ సినిమా విలన్ మద్దాలి శివారెడీ అంటే మాత్రం అందరికి గుర్తొస్తాడు. ఈయన ఒకప్పుడు హీరో అని ఎవరికి తెలియకపోవచ్చు. ఇతను హిందీ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించాడు.

ఇక హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు శ్రీకాంత్. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన శ్రీకాంత్ ఈమధ్య ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోతున్నాడు. దాంతో ‘అఖండ ‘ సినిమా నుండి విలన్ గా మారాడు. 2005లో ‘హ్యాపీ డేస్’ అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన వరుణ్ సందేశ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. కానీ అతనికి మెల్లి మెల్లిగా అవకాశాలు తగ్గడం తో బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా వెళ్ళాడు. ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ మైఖేల్ ‘ సినిమాలో విలన్ గా అవకాశం అందుకున్నాడు.