గోపీచంద్ మూవీ యాక్షన్ సీన్‌కి భారీ సెట్ రెడీ..!!

మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. కాగా ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ వేస్తున్నారు మేకర్స్.

ఈ యాక్షన్ సీక్వెన్స్ లోని విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయని.. ముఖ్యంగా గోపీచంద్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయట. మరి ఈ సినిమాలో శ్రీను వైట్ల, గోపీచంద్ కోసం ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.

ఇక ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ సంస్థ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వేణు దొనేపూడి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇంకా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. అన్నట్లు ఈ సినిమాకి విశ్వం అనే టైటిల్‌ని యూనిట్ పరిశీలిస్తుందట. స్క్రిప్ట్ కి తగ్గట్టుగా ఈ టైటిల్ సరిపోతుందని అంటున్నారట.