యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయనకున్న ఫాన్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సినిమా కి ఫస్ట్ డే కలెక్షన్ల ఏ రేంజ్ లో వసులవుతాయో ఊహించడం కూడా కష్టమే. ఎన్టీఆర్ నటించిన సినిమా లు చాలా వరకు బాక్సఫీస్ ని షేర్ చేసాయి. సింహాద్రి, ఆర్ ఆర్ ఆర్ సినిమా లతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులో ఎన్టీఆర్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటే ఇక అతనికి ఇండస్ట్రీ లో తిరుగుండదు అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఒక సంఘటన చూస్తే ఎన్టీఆర్ ని తన అభిమానులు ఎంతగా అభిమానిస్తున్నారో క్లియర్ గా అర్ధం అవుతుంది. తాజాగా ఎన్టీఆర్ కి సంబందించిన ఒక విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటించిన కొమరం భీం , దేవర సినిమా లోని పాత్రల రూపాలకు అనుగుణంగా వినాయకుని విగ్రహాలు తయారు చేసారు కొన్నిచోట్ల. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానమే అభిమానుల చేత ఇలా విగ్రహాలు తయారు చేసినట్లు తెలుస్తుంది. ఈ విగ్రహలకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చెయ్యగా ఆ ఫోటోలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ‘ దేవర ‘ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయినా ఈ సినిమా మరో ఆరు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ తెలుగు లోనే కాకుండా వేరే భాషలో కూడా బాగా పెరిగిపోతుంది. దేవర సినిమా కి పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ అనుకున్న విధంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది చూడాలి.